పోలీసుల ప్రీ వెడ్డింగ్ షూట్ (Pre wedding shoot) వీడియో వైరలవడంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందించారు. ‘పెళ్లిపై వారు కాస్త అత్యుత్సాహం చూపించారు. మహిళలకు పోలీస్ జాబ్ కష్టమైనది. డిపార్ట్ మెంటు వ్యక్తీ భాగస్వామి అవడంతో సెలబ్రేట్ (Celebrate) చేసుకున్నారు. మా ప్రాపర్టీ వాడుకోవడం తప్పుగా అనిపించలేదు. పర్మిషన్ (Permission) అడిగితే బాగుండేది. పెళ్లికి పిలవకపోయినా.. వారిని కలిసి ఆశీర్వదిస్తా అనుమతి లేకుండా ఎవరూ ఇలాంటివి చేయవద్దు’ అని సూచించారు.
వైరల్ కావడంతో కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) క్లారీటి ఇచ్చారు.యూనిఫాంను ఇలా వ్యక్తిగత అవసరాల కోసం వాడుకోవడం నేరమంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఫొటోషూట్ బావుందంటూ మెచ్చుకుంటున్నారు. ఫొటోషూట్(Photoshoot)లో వారు యూనిఫాం ధరించడాన్ని తాను తప్పుపట్టబోనని, కాకపోతే వారు ముందే అనుమతి తీసుకుని ఉంటే ఇంకా బాగుండేదని సీవీ పెర్కొన్నారు యూనిఫాంలో ఓ పోలీస్ కపుల్ (Police couple) తీయించుకున్న ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది.ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.