»Viral Video Pre Wedding Shoot In Operation Theater Netizens Are Furious
Viral Video: ఆపరేషన్ ధియేటర్లో ప్రీ వెడ్డింగ్ షూట్.. మండిపడుతున్న నెటిజన్లు
ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ డిఫరెంట్‌గా ఉండాలనే ఉద్దేశంతో ఓ డాక్టర్ ఆపరేషన్ ధియేటర్లో ప్లాన్ చేశాడు. వీడియో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వైద్యుడిని సస్పెండ్ చేశారు.
Viral Video: ప్రస్తుతం చాలా మంది వివాహానికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ జరిపిస్తున్నారు. ఇదే ఇప్పుడు ట్రెండ్. అయితే కొందరు ఈ ఫొటో షూట్లను వింతగా ప్లాన్ చేస్తున్నారు. అందరిలో తాము స్పెషల్‌గా కనిపించాలనే ఉద్దేశంతో ఢిపరెంట్‌గా ఫొటో షూట్లను ప్లాన్ చేస్తున్నారు. ఈక్రమంలో నూతన జంట ఆపరేషన్ ధియేటర్లో ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్‌ను ప్లాన్ చేసింది. ఆపరేషన్ ధియేటర్లో ఓ వ్యక్తిని ఆపరేషన్ చేస్తూ తీసిన ఫొటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
A doctor's pre-wedding photoshoot in a govt hospital's operation theatre in #Bharamasagar of #Chitradurga. Dr. Abhishek, a contract physician, performed a 'surgery' with his fiancee.
కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేసే డాక్టర్ అభిషేక్‌కు ఇటీవల వివాహం నిశ్చయమైంది. ప్రీ వెడ్డింగ్ షూట్ డిఫరెంట్‌గా ఉండాలనే ఉద్దేశంతో ఆస్పత్రి ఆపరేషన్ ధియేటర్లో ట్రై చేశారు. తన కాబోయే భర్త కూడా డాక్టర్ డ్రస్‌లో ఉంది. ధియేటర్లో భర్త ఆపరేషన్ చేస్తుంటే.. అతని భార్య హెల్ప్ చేస్తుంది. చివరల్లో ఆ పేషెంట్ ఆపరేషన్ బెడ్‌పై నుంచి లేస్తాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ డాక్టర్‌పై మండిపడుతున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం స్పందించింది. ఆ డాక్టర్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.