»Europe The Most Dangerous Chemical In The Body Researchers Shock
Europe : వారి శరీరాల్లో అతి భయంకర రసాయనం..పరిశోధకులు షాక్
మనిషి శరంలో అతి ప్రమాదకర రసాయనాన్ని పరిశోధకులు గుర్తించారు. యూరోపియన్ల శరీరంలో ఆ కెమికల్ ఉందని, దాని వల్ల క్యాన్సర్, సంతానోత్పత్తిలో లోపం రావడం వంటివి జరుగుతాయని వెల్లడించారు.
నేటి సమాజంలో మనిషి వినియోగించే ప్రతి వస్తువూ కల్తీ అయ్యింది. ఆహార పదార్థాల (Food Items) ద్వారా అనారోగ్య సమస్యలు (Health Issues) వాటిల్లుతున్నాయి. మనిషి శరీరంలోకి ప్లాస్టిక్ (Plastic) భూతం చొచ్చుకుపోతోంది. ఈమధ్యనే మనిషి రక్తం (Blood)లో ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు (Plastic Particles) శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.
తాజాగా యూరోపియన్ల (Europeans)లో అతి ప్రమాదకర రసాయనం (Chemical) ఉన్నట్లు తేలింది. ఆరోగ్యానికి చేటు చేసే రసాయనం యూరోపియన్ల శరీరాల్లో ఉందని, ఆ రసాయనం బాడీలోని హార్మోన్ల (Hormons)ను దెబ్బతీస్తోందని పరిశోధకులు గుర్తించారు. యూరోపియన్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ (European Environment Agency) నేతృత్వంలో శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
ఈ పరిశోధనలో షాకింగ్ విషయాలు తెలిశాయి. యూరప్‌లోని 11 దేశాల్లోని వయోజనుల్లో 71 శాతం మందికిపైగా శరీరంలో బిస్ఫెనాల్ ఏ రసాయనం ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు (Scientists) కనుగొన్నారు. బిస్ఫెనాల్ ఏను మోతాదుకు మించి వినియోగించడం వల్ల రొమ్ము క్యాన్సర్, సంతానోత్పత్తి సామర్థ్య లోపం వంటి సమస్యలు వస్తున్నాయని, దీనివల్ల చాలా మంది ఇబ్బంది పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.