తన ప్రతీ కన్నిటీ చుక్కకు అభిమానులు కూడా బాధపడ్డారని.. తాను నవ్వితే వారు కూడా నవ్వారని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. ఆర్ఆర్ఆర్లో అద్భుత నటనకుగానూ సైమా ఉత్తమ అవార్డును తారక్ స్వీకరించారు.
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ గత కొద్దీరోజుల నుంచి సైలంట్‌గా ఉంటున్నారు. సినిమా, లేదంటే ఫ్యామిలీతో గడుపుతున్నాడు. నో పాలిటిక్స్ అంటున్నారు. మామ చంద్రబాబు జైలులో ఉన్న ఉలుకు లేదు, పలుకు లేదు. దుబాయ్ వెళ్లి సైమా అవార్డ్స్ వేదిక మీద ఎమోషనల్ అయ్యారు. అభిమానుల గురించి ప్రస్తావించారు. తన ప్రతీ అడుగులో వారే ఉన్నారని మరీ మరీ చెప్పారు.
ఉత్తమ నటుడు
ఆర్ఆర్ఆర్ మూవీలో అద్భుత నటనకు గానూ జూనియర్ ఎన్టీఆర్‌కు ఉత్తమ నటుడి అవార్డును సైమా వేదికగా అందజేశారు. థాంక్యూ సైమా..అంటూ తారక్ ఎమోషనల్ అయ్యారు. మూవీలో కొమురంభీమ్ పాత్ర ఇచ్చినందుకు జక్కన్న రాజమౌళికి థాంక్స్ చెప్పారు. ఆ పాత్రను తాను చక్కగా చేస్తానని, నమ్మి ఇచ్చారని గుర్తుచేశారు. సహానటుడు, సోదరుడు రామ్ చరణ్‌కు థాంక్స్ చెప్పారు. ఆ తర్వాత అభిమానుల గురించి మాట్లాడారు. ప్రసంగిస్తూ.. ఎమోషనల్ అయ్యారు.
ఒడిదుడుకులు
తన జీవితం, లైఫ్‌లో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి ప్రస్తావించారు. ‘లైఫ్‌లో కిందపడిన సమయంలో పట్టుకుని తనను లేపినందుకు అభిమానులు థాంక్స్ చెప్పారు. కష్టాల్లో ఉన్న సమయంలో తన కళ్ల నుంచి వచ్చిన ప్రతీ నీటి చుక్కకు వారు కూడా బాధపడ్డారని తెలిపారు. సంతోషం వచ్చిన సమయంలో తాను నవ్వితే వారు కూడా ఆనందంగా ఉన్నారని వివరించారు. అభిమాన సోదరులకు తలవించి నమస్కారం చేస్తున్నా’ అంటూ ప్రసంగాన్ని ముగించారు.
తారక్ ఎందుకీలా
అవార్డు తీసుకొని.. ఎన్టీఆర్ చేసిన కామెంట్లపై చర్చ జరుగుతోంది. ఇప్పుడు స్టార్ హీరో కదా.. మళ్లీ ఒడిదుడుకులు.. కిందపడటం అంటూ మాట్లాడటంపై అభిమానులు ఆశ్చర్య పోయారు. ఎందుకీలా కామెంట్ చేశారు.. ఎన్టీఆర్ వేదనకు గల కారణం ఏంటీ అని ఆలోచిస్తున్నారు. ఫ్యామిలీ, రాజకీయాల్లో ఏమైనా జరిగిందా..? మరే ఇతర కారణం ఉందా అని జుట్టు పీక్కుంటున్నారు. తారక్ గత కొంతకాలంగా టీడీపీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతకుముందు క్యాంపెయిన్ చేసినప్పటికీ.. తర్వాత డిస్టన్స్ మెయింటెన్ చేస్తున్నారు.
బాబు అరెస్ట్
స్కిల్ స్కామ్‌లో మాజీ సీఎం, ఎన్టీఆర్ మామ చంద్రబాబు జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు. ఇప్పటివరకు ఆ అంశంపై తారక్ మాట్లాడలేదు. కనీసం ట్వీట్ కూడా చేయలేదు. దీంతో అతనికి ఏమైంది అని సర్వత్రా చర్చ జరిగింది. మీడియాలో రకరకాల ఊహాగానాలు కూడా వచ్చాయి. అయినప్పటికీ తారక్ నేరుగా దుబాయ్ వచ్చి సైమా అవార్డ్స్ ఫంక్షన్లో పాల్గొన్నారు. అక్కడ కూడా ఎమోషనల్ కావడంతో.. ఏం జరిగిందనే ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకడం లేదు.
వైసీపీలో
తారక్ మామ నార్నే శ్రీనివాస రావు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. తారక్ ఫ్రెండ్స్ కొడాలి నాని, వంశీ కూడా ఆ పార్టీలో ఉన్నారు. ఒక్క రాధా మాత్రమే టీడీపీలో ఉన్నారు. సో.. తారక్ ఇతర పార్టీలో చేరే అవకాశం లేదు. కానీ సొంత పార్టీలో ఆశించిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అంశం తొలచి వేస్తున్నట్టు ఉంది. అందుకే సైలంట్ అయిపోయారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.