»Naga Chaitanyas Second Marriage To A Girl From A Business Family What We Know
Naga Chaitanya: రెండో పెళ్లికి రెడీ అవుతున్న నాగ చైతన్య..?
అక్కినేని హీరో నాగ చైతన్య వైవాహిక జీవితం గురించి అందరికీ తెలిసిందే. ఆయన ప్రేమించి మరీ, సమంతను వివాహం చేసుకున్నారు. రెండు సంప్రదాయాల్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి జంటను చూసి అందరూ మురిసిపోయారు. అలాంటి ఈ జంట నాలుగేళ్లకే విడాకుల బాట పట్టారు.
నాగచైతన్య, సమంత ఎందుకు విడిపోయారు అనే విషయం మాత్రం అస్సలు బయటకు రాలేదు. కానీ, వారు విడిపోవడం అందరికీ బాధ కలిగించింది. అయితే, తాజా సమచారం మేరకు నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు హీరోయిన్ శోబితా దూళిపాళ్లతో ఆయన రిలేషన్ లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు మరో అమ్మాయితో పెళ్లి కుదిరినట్లు తెలుస్తోంది.
ఒక బిజినెస్ మాన్ కుటుంబానికి చెందిన అమ్మాయి తో చైతూ పెళ్లి నిశ్చయం అయ్యిందని తెలుస్తోంది..అలాగే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ నాగార్జున ఫ్యామిలీకి దగ్గరి బంధువులు కావడంతో ఈ పెళ్లికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇక అన్నీ అనుకున్నట్లుగా జరిగితే నవంబర్ లో లేదా డిసెంబర్ లో నాగచైతన్య ఆ అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుంటారని సమాచారం. ఇక చైతూ ప్రస్తుతం చందు మెండేటితో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది.