సీనియర్ రాజకీయ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్(DS) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాససంబంధ సమస్య తలెత్తడంతో ఆయనను హైదరాబాద్(Hyderabad)లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించినట్లు డీఎస్ చిన్న కుమారుడు, బిజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Arvind) ట్వీట్టర్ ద్వారా తెలిపారు. డీఎస్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఐసీయూ(ICU)లో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన డీఎస్‌ను కుటుంబ సభ్యులు నగరంలో సిటీ న్యూరో ఆస్పత్రిలో చేర్చారు.
గత కొంతకాలంగా ఆయన శ్వాస సంబంధిత సమస్యలతోపాటు పలు అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు. డీఎస్‌కు గతంలో బ్రెయిన్ స్ట్రోక్ (Brain stroke) రావడంతోపాటు పక్షవాతం కూడా సోకింది. ఆయన పరిస్థితి విశమంగా ఉందని, ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స అందిస్తున్నదని కుటుంబ సభ్యులు తెలిపారు. డీఎస్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్ రెండుసార్లు మంత్రిగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అప్పటి బీఆర్ఎస్ (BRS) చేరి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.
డీఎస్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 1989లో నిజామాబాద్
(Nizamabad) అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1998లో తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. 1999లో బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణను ఓడించి రెండోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ (Congress) శాసనసభాపక్ష ఉప నాయకుడిగా పనిచేశారు. 2004, 2009లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.