»Another Sensation In Medical History Fetus Without Sperm And Egg
Embryo: వైద్య చరిత్రలో మరో సంచలనం.. వీర్యం, అండం లేకుండానే పిండం!
పిల్లల్ని కనడానికి పిండం ముఖ్యం. వీర్యం, అండం కలిస్తేనే పిండం ఏర్పడి శిశువుగా ఎదుగుతుంది. కానీ శాస్త్రవేత్తలు అవి రెండు లేకుండానే కృత్రిమ పిండాన్ని తయారు చేశారు.
పిండం ఏర్పడాలంటే పురుషుల వీర్యకణాలు (Sperm cells), మహిళల్లోని అండాలు కలిసి ఫలదీకరం చెందాలి. అలా జరిగినప్పుడే పిండం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆ పిండం తల్లి కడుపులో శిశువుగా ఎదుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే పరిశోధకులు దీనిపై అనేక రకాల ప్రయోగాలు చేసి మరో కొత్త విషయాన్ని కనుగొన్నాయి. ఇజ్రాయెల్ (Israel)కు చెందిన శాస్త్రవేత్తలు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు.
వీర్యకణాలు (Sperm cells), అండం లేకుండానే కృత్రిమంగా ల్యాబ్‌లో ఓ పిండాన్ని సిద్ధం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రయోగం కలకలం రేపుతోంది. పెను సంచలనంగా మారింది. ఇజ్రాయెల్‌లోని వెయిమన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ కృత్రిమ పిండాన్ని తయారు చేశారు. మానవ పిండాన్ని అభివృద్ది చేయడానికి కంటే ముందు వీళ్లు ఎలుకలపై ఈ ప్రయోగాన్ని చేపట్టారు.
ఎలుకల (Rats) నుంచి సేకరించిన స్టెమ్ సెల్స్‌ను ల్యాబ్‌లోని ఒక కంటైనర్‌లో భద్రపరిచి అత్యాధునిక టెక్నాలజీతో తల్లి కడుపులోని వాతావరణాన్ని క్రియేట్ చేసి అందులో ఉంచారు. అందులోని పోషక జలం ప్రభావంతో వీర్యకణాలు, అండాలు లేకుండా స్టెమ్ సెల్స్ అభివృద్ధి చెందాయి. ఆఖరికి అండం ఏర్పడటంతో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టారు.
శాస్త్రవేత్తలు తయారు చేసిన ఆ కృత్రిమ పిండం నిర్మాణం పూర్తిగా మానవ పిండాన్ని పోలి ఉంది. కణజాలాలన్నీ అందులో ఉన్నాయి. పిండం అభివృద్ధి కూడా తల్లి కడుపులో ఉన్నట్టుగానే ఉంది. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో మరింత లోతుగా దీనిని శోదించి వాడుకలోకి తీసుకురాన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరిశోధన ద్వారా పిల్లలు లేని వారికి ఎంతో ఉపయోగం ఉందని వారు చెబుతున్నారు.