సాయి పల్లవి అంటే చాలు.. లేడీ పవర్ స్టార్ అంటూ రచ్చ చేస్తుంటారు ఆమె అభిమానులు. ఆమె గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంటుంది. తాజాగా మరో న్యూస్ వైరల్ అవుతోంది.
Yash’s films provide a major opportunity for Sai Pallavi
తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది సాయి పల్లవి. అందుకే ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లున్నా.. సాయి పల్లవి మాత్రం ఎంతో స్పెషల్ అని చెప్పొచ్చు. అమ్మడిని ఏకంగా లేడీ పవర్ స్టార్ అనేశాడు సుకుమార్. అయితే ఇంత డిమాండ్ ఉన్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండటం ఎవరికి అర్థం కాకుండా పోతోంది. తెలుగులో విరాట పర్వం సినిమా తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్ కమిట్ కాలేదు. దాంతో అసలు సాయి పల్లవి ఏం చేస్తోంది.. ఇండస్ట్రీకి ఎందుకు దూరమవుతోందనే.. చర్చ జోరుగా జరుగుతోంది.
ఆ మధ్యన అమ్మడు పెళ్లికి రెడీ అవుతుందనే టాక్ కూడా వినిపించింది. కానీ సాయి పల్లవి సినిమాలు చేయకపోవడానికి అసలు కారణం ఇదే అంటున్నారు. అందరి హీరోయిన్ల లాగా ఏ సినిమా పడితే అది చేసేందుకు సాయి పల్లవి అస్సలు ఇంట్రెస్ట్ చూపించదు. చివరగా గార్గి సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం తమిళంలో శివ కార్తికేయన్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. ఇది తప్పితే మరో సినిమా చేయడం లేదు అమ్మడు.
ఈ మధ్య తెలుగులో ఓ స్టార్ హీరో సినిమా కోసం సంప్రదించగా చెప్పిందట అమ్మడు. కథ, తన పాత్ర నచ్చకపోవడం వల్లే సాయి పల్లవి తెలుగులో సినిమాలు చేయట్లేదని టాక్ నడుస్తోంది. ఇప్పుడే కాదు కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా సెలెక్టెడ్ సినిమాలే చేస్తూ వస్తోంది సాయి పల్లవి. అందుకే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా, అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తామన్నా సినిమాలు చేయడానికి రెడీగా లేదట అమ్మడు. మరి సాయి పల్లవికి నచ్చే కథ ఎప్పుడు దొరుకుతుందో చూడాలి.