పశ్చిమబెంగాల్ (West Bengal) రాష్ట్రం జల్పాయ్గురి జిల్లాలోని సిలిగురి పట్టణ సమీపంలోగల బెంగాల్ సఫారీ పార్కులో రికా అనే పెద్దపులి (Big tiger) మూడు పిల్లలకు జన్మనిచ్చింది.ఈ నెల 19న ఆ మూడు పులి కూనలు జన్మించాయని బెంగాల్ సఫారీ పార్క్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఎన్‌క్లోజర్(Enclosure)లో ఉన్న తల్లీ రికా(Tigress Rika), దాని పిల్లలు సఫారీ పార్కులో సందడి చేస్తున్నాయి. వీటికి సంబంధించి సీసీ కెమెరాలో రికార్డ్ అయినా వీడియోను బెంగాల్ సఫారీ పార్కు అధికారులు రిలీజ్ చేశారు. ఈ వీడియోలో పెద్దపులి రికా, దాని మూడు పిల్లలను చూడవచ్చు. ఈ వీడియో (Video) నెట్టింట్లో వైరల్ గా మారింది. పిల్లలు సందడి చేస్తున్న వీడియో ఎన్‌క్లోజర్‌లోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అయితే దేశంలో పెద్ద పులుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోంది.కొన్ని అనారోగ్యంతో చనిపోతున్నాయి.పులుల పట్ల జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అవి అంతరించిపోయే పరిస్థితికి వస్తున్నాయి. ఎన్ని జంతుసంరక్షణ చట్టాలు తీసుకొచ్చినా. వాటిని పట్టించుకునే నాధుడు లేకుండా పోయాడు. ఫారెస్ట్ సిబ్బంది కూడా పులుల సంరక్షణకు సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. వాటిని కాపాడే ప్రయత్నం కూడా చేయడం లేదు.