గన్నవరం యువగళం సభలో టీడీపీ నేతలు ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడరని, వల్లభనేని వంశీ, కొడాలి నానిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని..వైసీపీ నాయకుల ఫిర్యాదుతో నారా లోకేష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
Nara Lokesh Bail Extended On Skill Development Scam
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్(Andra Pradesh) రాజకీయాల్లో(Politics) ప్రతి రోజు హీట్ పెరుగుతునే ఉంది. టీడీపీ(TDP) యువనేత నారా లోకేష్(Nara Lokesh) చేపట్టిన యువగళం(Yuvagalam) పాదయాత్రలో భాగంగా గన్నవరం(Gannavaram) సభలో ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అందులో ప్రజలను ప్రేరేపించేలా, వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని పేర్కొన్నారు. నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన పోలీసులకు నారా లోకేష్ అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో అక్కడ ఉన్న మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణకు ఆ నోటీసులు ఇచ్చారు. టీడీపీలోని సైకోలను పక్కన పెట్టుకుని సభలో లోకేశ్ రెచ్చిపోయారంటూ వారిపై తగిన చర్యలు తీసుకోవాలంటు వైసీపీ నేతలు వ్యాఖ్యనించారు.
మరోవైపు లోకేశ్ సహా పలువురు టీడీపీ నేతలపై పోలీసులకు గుడివాడ వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కొడాలి నాని(Kodali nani), వల్లభనేని వంశీ(Vallabhaneni Vamshi)లను చంపేస్తాననే విధంగా టీడీపీ నాయకులు మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లోకేశ్, బుద్దా వెంకన్న, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావు, అయ్యన్నపాత్రుడులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. అయితే యువగళం సభలో తెలుగుదేశం పార్టీ నేతలు బోర్డర్ దాటి మాట్లాడారని వైసీపీ శ్రేణులు పేర్కొన్నారు.
గతంలో నారా చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు, ఆ తరువాత పార్టీ కార్యాలయంపై దాడులు చేశారని దానికి జవాబు ప్రజాక్షేత్రంలోనే చెబుతామని అన్నారు. అలాగే కృష్ణజిల్లాలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఇద్దరు రౌడీలుగా అభివర్ణిస్తూ.. వారిద్దరిని ప్రజలు కొట్టిచంపుతారనే అనుచిత వ్యాఖ్యలను టీడీపీ నేతలు చేశారు. ఈ వేదికగా నాలుగున్నర సంవత్సరాలుగా గన్నవరంలో జరిగిన ఇసుక దోపిడి, భవన నిర్మాణ కార్మికుల కష్టాలను, లిక్కర్ స్కామ్లా గురించి లోకేష్ ప్రస్తావించారు.