NTR: కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మారుస్తూ నూతనంగా తీసుకొచ్చిందని, వికసిత భారత్ గ్యారంటీ అండ్ అజ్విక్ మిషన్ పథకంతో గ్రామీణ పేద ప్రజలకు ఉపాధి గ్యారెంటీ లేదని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి సిహెచ్ సుధాకర్ అన్నారు. ఆదివారం మైలవరంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో పని హక్కు కాపాడుకుందాం అంటూ ఇంటింటికీ ఉపాధి పేరుతో సీపీఎం రాష్ట్ర పోస్టర్లను ఆవిష్కరించామన్నారు.