హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL)లో సుమారు 20 టెక్నీషియన్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ఈ నెల 20వ తేదీన గడువు ముగుస్తుందని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా టెన్త్, ఐటిఐ, డిప్లొమా అభ్యర్థులు ECIL వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నట్లు పేర్కొంది.