నటి రేణు దేశాయ్ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కార్ వారి పాట’ మూవీలో తనకు అవకాశం వచ్చిందని.. కథ, పాత్ర తనకు నచ్చాయని తెలిపింది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. అయితే ఆ కారణాలు బయటపెడితే అనవసరమైన వివాదాలు చెలరేగే అవకాశం ఉందని, దానిపై మౌనంగా ఉండటమే మంచిదని వెల్లడించింది.