కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు (Software employees) కొన్ని గంటలు మాత్రమే పని చేసి మిగతా సమయంలో ఖాళీగా ఉంటూ శాలరీలు పొందుతున్నారని ఆయా కంపెనీల సీఈవోలు చర్చలు జరిపారు. ఇటీవల ఫార్చూన్ (Fortune) పత్రిక ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఇంటర్వ్యూ చేసింది. అతడు రోజుకు గంట మాత్రమే పని చేసి ఏడాదికి దాదాపు 1.50 లక్షల డాలర్ల (రూ. 1.2 కోట్లు)ను సంపాదిస్తున్నాడని తెలిపింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వైరల్‌గా మారడంతో సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆశ్చర్యపోతున్నారు. అసలు అతడు చేసే పనేంటంటే.. జాసన్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను కూడా గతంలో ఇన్సైడర్ (Insider) ఇంటర్వ్యూ చేయగా.. అతడు వారానికి 30 గంటల కంటే ఎక్కువ వర్క్ చేయనని తెలిపారు. పనిభారం తక్కువగా ఉండడంతో అతడు రెండు ఫుల్‌టైం ఉద్యోగాల(Full time jobs)ను చేస్తున్నట్లు వివరించాడు.
ఒకవేళ ఎక్కువ గంటలు పని చేయాల్సి వస్తే ఒక ఉద్యోగాన్ని వదిలేసేవాడినని తెలిపాడు.20 ఏళ్ల డేవాన్ (పేరు మార్చారు) అనే వ్యక్తి గూగుల్ (Google) ఎంప్లాయ్. అతడు రోజంతా కష్టపడకుండా కేవలం గంట మాత్రమే పని చేస్తానంటూ తెలిపారు. మేనేజర్ (Manager) ఇచ్చే కోడ్‌ను పూర్తి చేయడానికి కనీసం వారం రోజులు పడుతుంది. అందుకు అతడు కోడ్ (Code) లో కీలకమైన భాగాన్ని ముందుగానే రాసుకుంటానని తెలిపాడు. మిగిలిన పనిని వారం రోజుల్లోపు తాపీగా పూర్తి చేస్తానని వివరించాడు. అయితే, ఇందుకోసం రోజంతా కష్టపడకుండా వేగంగా కోడ్‌ను రాస్తానని.. దీని కోసం కేవలం గంట సమయాన్ని కేటాయిస్తానని తెలిపాడు. ‘‘ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనంతరం గంట పాటు గూగుల్ కోసం పని చేస్తాను. దీని కోసం రోజంతా కష్టపడను. మిగిలిన సమయాన్ని నా స్టార్టప్ (Startup) కోసం వినియోగిస్తున్నాని ఆయన తెలిపాడు.