Jad Hadid Akansha Puri Kiss:బిగ్ బాస్ OTT 2 షో ముగిసింది. జైద్ హదీద్,ఆకాంక్ష పూరి షోలో లిప్ లాక్ తో ఫుల్ పాపులర్ అయిపోయారు. షో తర్వాత కూడా జైద్, ఆకాంక్ష ఒకరినొకరు బహిరంగంగా ముద్దుపెట్టుకున్నారు. దీని కారణంగా వారు చాలా ట్రోల్ చేయబడుతున్నారు. ఇదిలా ఉంటే జైద్ హదీద్ ప్రియురాలు ఆకాంక్ష పూరిని హెచ్చరించినట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. జైద్ హదీద్ స్నేహితురాలు ఆకాంక్ష పూరీకి వార్నింగ్ ఇచ్చింది. సల్మాన్ ఖాన్ రియాలిటీ షో బిగ్-బాస్ OTT 2 ముగిసిన తర్వాత కూడా వీర వార్తల ముఖ్యాంశాల్లోనే ఉన్నారు. ఇటీవల జైద్ హదీద్, ఆకాంక్ష పూరి పాలక్ పురస్వాని బర్త్ డే వేడుకకు వచ్చారు. ఈ సమయంలో ఫోటో గ్రాఫర్ల కోరిక మేరకు వారిద్దరూ కెమెరా ముందు ఒకరినొకరు ముద్దుపెట్టుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ విషయంలో జైద్ హదీద్ ప్రేయసి ఎంట్రీ ఇచ్చి ఆకాంక్ష పూరికి వార్నింగ్ ఇచ్చింది.
జైద్ హదీద్ ఇటీవల తన స్నేహితురాలితో మొదటిసారిగా కనిపించాడు. ఈ సమయంలో వారిద్దరూ ఫోటో గ్రాఫర్లకు ఘాటుగా పోజులిచ్చారు. ఫోటో గ్రాఫర్లు జైద్‌ను ఆకాంక్ష ఎక్కడ అని అడిగారు. జైద్ మళ్లీ తన స్నేహితురాలిని ఈ ప్రశ్న అడిగాడు. ఆమె మొదట జైద్ వైపు చూసి తర్వాత కెమెరా వైపు చూస్తూ ‘ఆకాంక్ష జైద్కి దూరంగా ఉండు, సరేనా’ అని చెప్పింది. ఇది విన్న జైద్ హదీద్ నవ్వడం ప్రారంభించాడు. అయితే ఈ సమయంలో జైద్ తన ప్రియురాలి బుగ్గలపై ముద్దు పెట్టుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జైద్ హదీద్, ఆకాంక్ష బిగ్-బాస్ OTT 2 ఒక ఎపిసోడ్లో ఆకాంక్ష పూరికి ఒక టాస్క్ వచ్చింది. ఆమె జైద్ హదీద్‌ను సుమారు 30 సెకన్ల పాటు లిప్ కిస్ పెట్టింది. దాని కారణంగా ఆమె చాలా ట్రోల్ చేయబడింది. ప్రియురాలి వార్నింగ్ తర్వాత ఆకాంక్ష పూరి దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.