»Corona Tension Again Huge Number Of New Cases Registered In Last 28 Days
Corona: మళ్లీ కరోనా టెన్షన్.. గత 28 రోజుల్లో భారీగా కొత్త కేసులు నమోదు
దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో కరోనా కేసులో నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గత 28 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 80 శాతం కేసులు పెరిగినట్లు తెలిపింది.
కరోనా(corona) మహమ్మారి మళ్లీ టెన్షన్ పెడుతోంది. గత కొన్ని రోజులుగా తగ్గాయని అనుకుంటున్న కేసులు తాజాగా పెరుగుతున్నాయి. గడిచిన 28 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్19 (covid 19) కేసులు భారీగా పెరిగాయి. గత నెల జూలై 10వ తేది నుంచి ఆగస్టు 6వ తేది వరకూ 28 రోజుల కాలంలో కరోనా కేసులు సంఖ్య భారీగా పెరిగినట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కొత్త కేసుల సంఖ్య పెరగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(World Health Organisation) ఆందోళన వ్యక్తం చేసింది.
అంతకుముందు 28 రోజులతో పోల్చితే ఈ 28 రోజుల్లో కొత్త కేసుల సంఖ్య 80 శాతం పెరిగిందని డబ్ల్యూహెచ్ఓ (WHO) వెల్లడించింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఓ ఐదు ప్రాంతాల్లో మాత్రం కొత్త కేసులు (New Cases), మరణాల సంఖ్య తగ్గినట్లు పేర్కొంది. వెస్టర్న్ పసిఫిక్ రీజియన్లో మాత్రం కొత్త కేసుల సంఖ్య పెరిగిందని, మరణాల సంఖ్య బాగా తగ్గినట్లు వెల్లడించింది.
ఈ నేపథ్యంలో వాతావరణ పరిస్థితుల వల్ల ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారని, తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దూర ప్రయాణ సమయంలో మాస్కులు కచ్చితంగా ధరించాలని తెలిపారు. చేతులు శుభ్రంగా కడిగి భోజనం తినాలని, అనారోగ్య సమస్యలు (Health Problems) వస్తే కచ్చితంగా వైద్యులను సంప్రదించాలని డబ్ల్యూహెచ్ఓ (WHO) సూచించింది.