పొలంలో పనిచేసుకుంటున్న ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఓ డేగ పాము(Snake)ను తన కాళ్లతో పట్టుకొని ఆకాశంలో వెళ్తోంది. అయితే పొలం దగ్గరికి వచ్చేసరికి ఆ పాము డేగ(Eagle) కాళ్ల నుంచి జారి మహిళపై పడిపోయింది. ఆ మహిళను పలుమార్లు కాటు వేసింది. ఆ తర్వాత కొద్ది క్షణాల తర్వాత డేగ కూడా ఆ మహిళపై దాడి చేసింది. దీంతో ఆ మహిళ ఆస్పత్రిపాలైంది. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో చోటుచేసుకుంది.
మహిళా వృద్ధ రైతుకు జరిగిన ఈ విచిత్ర అనుభవాన్ని ది న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని వెల్లడించింది. టెక్సాలోని సిల్స్బీకి చెందిన 65 ఏళ్ల పెగ్గీ జోన్స్ అనే మహిళకు ఆరు ఎకరాల పొలం ఉంది. అందులో తన భర్తతో కలిసి వ్యవసాయం చేసుకుంటోంది. పొలంలో ఆమె పనులు చేసుకుంటూ ఉండగా డేగ నుంచి తప్పించుకున్న విష సర్పం ఆమెపై పడింది.
పాము(Snake) తనపై పడటంతో పెగ్గీ జోన్స్ ఉలిక్కిపడింది. పాము ఆమెను కాటు వేసింది. ఆమె తీవ్రంగా అరచినా లాభం లేకుండా పోయింది. డేగ(Eagle) కూడా ఆ మహిళపై దాడి చేసింది. పామును ఆమె నుంచి లాక్కునే ప్రయత్నం చేసింది. ఆమె అరుపులు విన్న భర్త పరుగెత్తుకొచ్చి తన భర్త గాయాలతో ఉండటం చూసి షాక్ అయ్యాడు.
పెగ్గీ జోన్స్‌ను ఆమె భర్త ఆస్పత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్లు ఆమెను పరీక్షించి కొంత కాలం పాటు చికిత్స అందించారు. చికిత్స తర్వాత కోలుకున్న ఆమె ఇప్పుడు పొలంలోకి వెళ్లడం లేదు. పొలంలోకి వెళ్తే తనకు జరిగిన ఘటనే గుర్తుకొస్తోందని ఆమె తీవ్రంగా భయపడిపోయింది. తనకు జరిగిన అనుభవం ఎవ్వరికీ ఎదురవకూడదని ఆమె కోరుకుంటోంది.