»Demand Of Aspirants To Postpone Group 2 Exam In Telangana On August 10th 2023
Group2: ఎగ్జామ్ వాయిదా వేయాలని ఉద్యోగార్థుల ఆందోళన
రాష్ట్రంలో గ్రూప్ 2(group2) ఎగ్జామ్(exam) వాయిదా వేయాలని ఉద్యోగార్థులు TSPSC కార్యాలయాన్ని ముట్టడించారు. గురుకుల పరీక్షలు ఉన్న షెడ్యూల్లోనే ఈ ఎగ్జామ్ కూడా నిర్వహించడం సరికాదన్నారు. దీంతోపాటు పేపర్ లీకేజీ కారణంగా తమ సమయం వృథా అయ్యిందని ఈ నేపథ్యంలో ఎగ్జామ్ మరో రెండు మూడు నెలలు పోస్ట్ పోన్ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ(telangana)లో గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేయాలని ఉద్యోగార్థులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పెద్ద ఎత్తున వచ్చి TSPSC కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రోడ్లపై బైఠాయించిన నిరసన తెలిపారు. ఎలాగైనా సరే ఈ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, కొందడ రామ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. రిక్రూట్మెంట్ పరీక్షను వాయిదా వేయాలన్న డిమాండ్‌కు మరికొంత మంది కార్యకర్తలు, ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. అయితే ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహిస్తామని ఇప్పటికే TSPSC అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TREIRB) తన గురుకుల పరీక్షలను ఆగస్టు 1 నుంచి 22 వరకు షెడ్యూల్ చేసింది. అదే సమయంలో గ్రూప్ 2 పరీక్ష ఉండటంతో ఈ ఎగ్జామ్ వాయిదా వేయాలని ఉద్యోగార్థులు కోరుతున్నారు. పోటీ పరీక్షలన్నింటిని హడావుడి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థులపై ఒత్తిడి తెస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. పరీక్షల మధ్య కనీసం ఒక నెల గ్యాప్ కూడా ఉండటం లేదని అంటున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ తెలంగాణ నిరుద్యోగ యువతకు ద్రోహం చేస్తోందని మండిపడుతున్నారు. ప్రశ్నపత్రం లీక్ కారణంగా అనేక మంది రెండు మూడు నెలలు చదవకుండా ఉండిపోయామని కనీసం రెండు నెలలు ఈ ఎగ్జామ్ వాయిదా వేయాలని కోరుతున్నారు.
గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలంటూ టీఎస్పీఎస్సీ ముట్టడికి భారీగా తరలి వచ్చిన గ్రూప్-2 అభ్యర్థులు pic.twitter.com/KPhemaCLG1