మణిపూర్లో భారతమాతను చంపెశారు అన్న రాహుల్ గాంధీ మాటలపై సృతీ ఇరానీ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతికి మారుపేరన్నారు. ఎమర్జెన్సీ నాటీ పరిస్థితులను గుర్తు చేశారు.
Sruti Irani got angry with Congress for Rahul Gandhi's words in Lok Sabha
Sruti Irani: లోక్సభలో(Lok Sabha) కాంగ్రెస్(Congress ) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) మండిపడ్డారు. భారతమాతను చంపారన్న ఆయన మాటలకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్ ను ఎవరూ విభజించలేరు, ముక్కలు చేయలేరని ఆమె స్పష్టం చేశారు. మణిపూర్ భారత్ లో అంతర్భాగమన్నారు. భారతమాతను హత్య చేశారని అంటే కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తున్నారని, 1984 అల్లర్లు, కశ్మీర్ హింసను స్మృతి ఇరానీ ప్రస్తావించారు. అర్టికల్ 370ని తాము రద్దు చేసి అక్కడ శాంతిని నెలకొల్పామని పేర్కొన్నారు. దేశంలో అవినీతిని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీనే అని స్మృతి ఇరానీ విమర్శించారు. మీరు ఇండియాకు కాదు అవినీతికి ప్రతిరూపం అని పేర్కొన్నారు. కశ్మీర్ పండితుల బాధను మీరెప్పుడు పట్టించుకోలేదని అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో జరిగిన అఘాయిత్యాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.