సంక్రాంతి రేసులో దూసుకొచ్చిన బాలకృష్ణ వీరసింహారెడ్డి మూవీ రిలీజై థియేటర్లలో దుమ్ము దులుపుతోంది. బాలయ్య డ్యాన్సులు, పాటలు, డైలాగులు, యాక్షన్ కి ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. థియేటర్లలో బాలయ్య ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా లేదు. బాలయ్య నోటి నుంచి చిన్న డైలాగ్ వస్తేనే పవర్ ఫుల్ గా ఉంటుంది. అలాంటిది రోమాలు నిక్కపొడుచుకునే డైలాగులు.. బాలయ్య మీసం తిప్పుతూ చెప్తుంటే థియేటర్లలో ఫ్యాన్స్ శివాలూగుతున్నారు. బిగ్ స్క్రీన్ మీద తన అభిమాన నటుడు బాలకృష్ణ స్టెప్పులు చూసి ఉత్సాహం తట్టుకోలేక ఓ తాత థియేటర్లోనే తనదైన స్టైల్లో డ్యాన్స్ చేసి అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. తిరుపతిలోని సంధ్య థియేటర్లో వీరసింహారెడ్డి సినిమా చూస్తూ బాలయ్య ఫ్యాన్స్ వీర లెవల్లో విజిల్స్, చప్పట్లతో ఎంజాయ్ చేశారు. అదంతా చూసిన ఓ పెద్దాయన ఉత్సాహం ఆపుకోలేక వారితో జత కలిశారు. తనదైన స్టైల్లో స్టెప్పులు వేసి డ్యాన్స్ చేసి ఆకర్షించారు. థాత స్టెప్పులు వేస్తుంటే థియేటర్లో ఉన్నవారంతా చప్పట్లు కొడుతూ.. జై బాలయ్య అని నినాదాలు చేస్తూ ఎంకరేజ్ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. తెగ వైరల్ అవుతుంది.
మరోవైపు కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌కు షో మధ్యలో బాలయ్య వచ్చి, అభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. బాలయ్య, డైరెక్టర్ గోపిచంద్ మలినేని మూవీ యూనిట్ కలిసి సినిమా చూశారు. మాస్ మూవీ కావడంతో థియేటర్ వద్ద అభిమానులు హంగామా చేస్తున్నారు. డప్పులు కొడుతూ డ్యాన్సులు చేస్తూ.. తెగ హడావిడి చేస్తున్నారు. థియేటర్ల ముందు జై బాలయ్య నినాదాలు హోరెత్తిస్తున్నాయి. వీరసింహారెడ్డి సినిమాకు అభిమానులే కాదు రివ్యూల పరంగా కూడా పాజిటివ్ టాక్ వచ్చింది.