టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం సినిమాల నుంచి విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘ఖుషి’షూటింగ్ పూర్తి చేసిన సమంత.. తాను కొన్ని నెలలపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన ఆరోగ్యం పై దృష్టి సారించబోతున్నట్లు తెలిపింది.ఈ క్రమంలోనే ప్రస్తుతం వెకేషన్ ట్రిప్ ని ఫ్రెండ్స్ తో కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తోంది. ఇండస్ట్రీ(Industry)లో సమంత బెస్ట్ ఫ్రెండ్స్ లో సింగర్ చిన్మయి కూడా ఒకరు. వీళ్లిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఈనాటిది కాదు. సమంత నటించిన ‘ఏ మాయ చేసావే’ సినిమాలో సమంత పాత్రకి చిన్మయి(Chinmai)డబ్బింగ్ చెప్పింది. తర్వాత చాలా సినిమాల్లోనూ సమంతకు చిన్మయి డబ్బింగ్ చెప్పగా.. ఆ వాయిస్ తోనే సమంతకు మంచి గుర్తింపు వచ్చింది. అలా వాళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా మారారు.
సమంత చిన్మయి ఇంట్లో సందడి చేసింది. చిన్మయి కవల పిల్లలతో సమంత ఆడుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిన్మయి కవల పిల్లలతో సరదాగా ఆడుతున్న సమంత వాళ్ళతో ఓ పోటీలో ఓడిపోతున్నట్టు కూడా ఈ వీడియోలో కనిపిస్తోంది. ఇక ఈ వీడియోను రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) ని తీసినట్టు తెలుస్తోంది. ఈ వీడియోని సమంత తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేయగా.. ఈ వీడియో కాస్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోకి నెటిజన్స్, ఫ్యాన్స్ లైక్ ల వర్షం కురిపిస్తున్నారు. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ అనే సినిమా(Khushi’ movie)లో నటిస్తున్న విషయం తెలిసిందే. నిన్ను కోరి మూవీ ఫేమ్ శివ నిర్వాణ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. రీసెంట్ గానే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.