కొందరు పాలు అమ్మేందుకు ఆవుల పెంపకం చేస్తుంటే, కొందరు గేదెల వ్యాపారం చేస్తుంటారు. దేశంలో పాలు, దాని ఉత్పత్తులను విక్రయించడం ద్వారా చాలా మంది సంవత్సరానికి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. అయితే ఆవు పేడను అమ్మి ఓ రైతు కోటీశ్వరుడయ్యాడు. అతని గురించి తెలుసుకుందాం..
Agriculture Success Story: భారతదేశం వ్యవసాయ దేశం. ఇక్కడ దాదాపు 80 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. కోట్లాది మంది రైతులు తమ ఇంటి ఖర్చుల కోసం పశుపోషణ కూడా చేస్తుంటారు. కొందరు పాలు అమ్మేందుకు ఆవుల పెంపకం చేస్తుంటే, కొందరు గేదెల వ్యాపారం చేస్తుంటారు. దేశంలో పాలు, దాని ఉత్పత్తులను విక్రయించడం ద్వారా చాలా మంది సంవత్సరానికి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. అయితే ఆవు పేడను అమ్మి ఓ రైతు కోటీశ్వరుడయ్యాడు. అతని గురించి తెలుసుకుందాం..
ఆ రైతు పేరు ప్రకాష్ నెమాడే. అతను మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా సంగోలా తాలూకాలో ఉన్న ఇమ్దేవాడి గ్రామ నివాసి. ప్రకాష్ తన హార్డ్ వర్క్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆవు పేడను అమ్మి కోటి రూపాయల విలువైన బంగ్లాను నిర్మించాడు. ఈ బంగ్లాకు ‘గోధన్ నివాస్’ అని పేరు పెట్టారు. ప్రకాష్ నెమాడే తనకు 4 ఎకరాల వంశపారంపర్యంగా వచ్చిన భూమి మాత్రమే ఉంది. కానీ నీరు లేకపోవడంతో సక్రమంగా సాగు చేయలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో జీవనోపాధి కోసం ఆవులను పెంచాడు. ఆ తర్వాత పాలు అమ్ముతూ బాగా సంపాదించడం మొదలుపెట్టాడు. విశేషమేమిటంటే.. పాల వ్యాపారం ప్రారంభించేటప్పటికి అతడి వద్ద ఉండేది ఒకే ఆవు. మొదట్లో ఇంటింటికి పాలు అమ్మేవాడు. కానీ కఠోర శ్రమ వల్ల ఆవుల పెంపకంలో పెద్ద సామ్రాజ్యాన్నే నిర్మించాడు. నేడు అతని వద్ద 150 ఆవులు ఉన్నాయి. ఇప్పుడు స్మార్ట్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారారు. పాలతో పాటు ఆవు పేడ వ్యాపారం కూడా చేస్తున్నాడు.
షాకింగ్ విషయం ఏంటంటే.. ఆవు పేడను అమ్ముతూ కోట్ల రూపాయల పరిశ్రమను స్థాపించాడు ప్రకాష్ నెమాడే. సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు వారి వద్ద ఆవు పేడను కొనుగోలు చేస్తారు. ఇది కాకుండా అతను ఆవు పేడ గ్యాస్ ప్లాంట్‌ను కూడా నిర్మించాడు. ఆవు పేడతో పాటు గ్యాస్ కూడా అమ్ముతున్నారు. గోవులకు ముసలితనం వచ్చే వరకు సేవ చేయడమే గొప్ప విషయం. ఇప్పటి వరకు ఆవు పేడ వ్యాపారం ద్వారా కోటి రూపాయలకు పైగా సంపాదించాడు.