Huge discount offer on Ola scooties.. Ten thousand discount
Ola Electric: పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) రేట్లు భగ్గుమంటోన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంపై ప్రజలు దృష్టిసారించారు. ఎలక్ట్రిక్ వాహనాలను (Electric vehicles) కొనుగోలు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు అన్ని దేశాల్లో మంచి మార్కెట్ ఉంది. కస్టమర్లను ఆకర్షించి కొనుగోళ్లు పెంచుకోవడానికి ఆయా సంస్థలు ఆఫర్లు తీసుకోస్తున్నాయి. ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్లు తయారు చేసే ఓలా (Ola electric) సంస్థ కష్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఓలా ఎస్1 ఎయిర్ (S1 Air) కొనుగోలుపై రూ.10 వేల డిస్కౌంట్(10 thousand discount) అందిస్తోంది. ఆగస్టు 15వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.
ఓలా ఎస్1 సిరీస్‌లో ఎస్1 ఎయిర్ పేరుతో ఎంట్రీ లెవల్ స్కూటర్‌ను ఓలా ఎలక్ట్రిక్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే దీనికి బుకింగ్స్ ప్రారంభించింది. జులై 28 వరకు రిజిస్టర్ చేసుకున్న వారికి, ఓలా కమ్యూనిటికీ రూ.1,09,999కే ఎస్ 1 ఎయిర్‌ను అందిస్తామని కంపెనీ ప్రకటించింది. జులై 31 నుంచి ఇతర వినియోగదారులకు బుకింగ్‌కు అవకాశం కల్పించింది. వీరికి మాత్రం రూ.1,19,999గా తొలుత ధర నిర్ణయించింది. ఈ స్కూటర్లకు వస్తున్న ఆదరణను బట్టి అందరికీ రూ.10వేలు తక్కువకే స్కూటర్‌ను అందిస్తామని పేర్కొంది. ఎస్1 ఎయిర్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా అందరికీ రూ.1.1 లక్షలకే ఇవ్వాలని కంపెనీ నిర్ణయించినట్లు ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీశ్ అగర్వాల్ తెలిపారు.
ఊహించిన దానికంటే ఎక్కువ బుకింగ్స్ వచ్చాయని, రిజర్వ్ చేసుకొని వారికీ రూ.1.1లక్షలకే ఇవ్వాలని చాలా మంది కోరినట్లు తెలిపారు. దీంతో జులై 31 రాత్రి నుంచి ఆగస్టు 15 మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఎస్ 1 ఎయిర్‌లో 3 kWh బ్యటరీ ఉంటుంది. ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌తో 125 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. గరిష్ఠంగా 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు.
Ola ఇటీవలే తన 750వ ECని ప్రారంభించింది. ఆగస్టు నాటికి 1,000 షోరూమ్‌లను ఓపెన్ చేసే యోచనలో ఉంది. కస్టమర్లకు అనుకూలమైన ప్రదేశాల్లో వీటిని ప్రారంభించనుంది. తరువాత ఓలా స్కూటర్ల నుంచి S1 ప్రో, S1, S1 ఎయిర్‌లను అత్యుత్తమ సాంకేతికత, అసమానమైన పనితీరుతో అందమైన డిజైన్లతో వినియోగదారులను ఆకర్షిస్తుంది. కంపెనీ 2W Eలో అమ్మకాల చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉంది.