KA Paul: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (KA Paul) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత కత్తి మహేశ్ గురించి ఈ సారి మాట్లాడారు. తన శాపం వల్లే ఆయన చనిపోయారని తెలిపారు. ఒక్క కత్తి మహేశ్ కాదు ఇదివరకు చాలా మందిపై తన శాపం పనిచేసిందని గుర్తుచేశారు. మణిపూర్ అంశాన్ని మీడియా కూడా పట్టించుకోవడం లేదని మడిపడ్డారు. బీజేపీకి మద్దతుగా భజన చేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు.
మణిపూర్ ఇష్యూ గురించి తాను తప్ప ఏ ఇతర పాస్టర్ మాట్లాడలేదని పాల్ (KA Paul) అన్నారు. పాస్టర్ సతీష్ కుమార్ చందాల పేరుతో కోట్ల రూపాయలు వసూల్ చేస్తున్నారని ఆరోపించారు. వాటిని బీజేపీకి విరాళాలు ఇస్తున్నారని మండిపడ్డారు. మణిపూర్ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని అడిగారు. తన శిష్యుడే కానీ.. అరాచకాలు చేస్తున్నాడని తెలిపారు. తాను 42 ఏళ్లు ప్రార్థన చేశానని.. ఏ ఒక్క రోజు కూడా రూపాయి తీసుకోలేదని వివరించారు. అక్టోబర్ 2వ తేదీన శాంతి సభ నిర్వహించే సమయంలో తమ కరపత్రాలను సతీష్ కుమార్ పంచనీయలేదని ఆరోపించారు. 5 లక్షల కోట్ల సొంత డబ్బును ప్రజల కోసం దానం చేశానని వివరించారు. 2200 మీటింగ్స్ ఏర్పాటు చేశానని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ అధికారం చేపడుతుందని పాల్ (KA Paul) అన్నారు. తాను సీఎం అవుతానని.. రాష్ట్రాన్ని డెవలప్ చేస్తానని వివరించారు. తర్వాత ఏపీలో కూడా తమ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల వర్షాన్ని కూడా ఆపానని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు కేఏ పాల్. దేవుడి బిడ్డనని.. ప్రేయర్ చేస్తే అనుకున్నది జరుగుతుందని నమ్మించే ప్రయత్నం చేశారు.