Srileela: క్రేజీ ఆఫర్ రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదే..!
క్రేజీ హీరోయిన్ శ్రీలీల గురించి తెలియనివారు ఉండరు. ప్రస్తుతం ఏ మూవీలో చూసినా శ్రీలీలే కనపడుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎవరికీ లేని క్రేజ్ ఈ తెలుగు అమ్మాయి సొంతం చేసుకుంది. అందుకే ఆఫర్లు అన్నీ ఈ బ్యూటీ చుట్టే తిరుగుతున్నాయి. స్టార్ హీరో దగ్గర నుంచి కుర్ర హీరో వరకు అందరూ శ్రీలీలే తమకు హీరోయిన్ గా రావాలని కోరుకుంటున్నారు.
అంత క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఓ క్రేజీ ఆఫర్ రిజెక్ట్ చేసింది. స్టార్ హీరో అల్లు అర్జున్(Allu arjun) బంపర్ ఆఫర్ ఇచ్చారట. అయితే ఆ ఆఫర్ ని ఆమె రిజెక్ట్ చేయడం గమనార్హం. శ్రీలీలకు వచ్చిన ఆఫర్ ఏంటంటే, పుష్ప2లో ఐటెం సాంగ్స్ చేయడం. శ్రీలీల డ్యాన్స్ అద్భుతంగా చేస్తుంది కాబట్టి, ఆమె చేస్తే బాగుటుందని సుకుమార్ ఆమెను సంప్రదించారట. మొదటి భాగం పుష్ప లో స్టార్ హీరోయిన్ సమంత(samantha)తో చేయించారు. ఆ ఊ అంటా వా పాట ఎంత క్లిక్ అయ్యిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.
ఈ విషయం గుర్తుంచుకొని, మళ్లీ క్రేజ్ ఉన్న హీరోయిన్ తో చేయించాలని అనుకున్నారు. అందుకే శ్రీలీల(Srileela)ను అడిగారు. అయితే, ఇప్పటికే ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అవి పూర్తి చేయడానికే ఆమెకు చాలా కాలం పట్టేలా ఉంది. ఇప్పుడు ఈ సాంగ్ కి షెడ్యూల్స్ ఇవ్వడం కష్టమే, అంతేకాకుండా, ఒక్కసారి ఐటెం సాంగ్ చేస్తే, మళ్లీ మళ్లీ అడుగుతూ ఉంటారని ఆమె ఆ ఆఫర్ వద్దు అనుకుందట.