డేటింగ్ యాప్‌లో పరిచయం అయిన అమ్మాయిపై గ్యాంగ్ రేప్ జరిగిన సంఘటన హ్యర్యానా గురుగ్రామ్‌లో జరిగింది. పరిచయం అయిన వ్యక్తి హోటల్‌కు పిలిచి తినే పదార్థంలో మత్తు కలిపాడు. తన స్నేహితుడు ఇద్దరు కలిసి అమ్మాయిపై అత్యాచారం చేశారు.
Dating App: చేతిలో మొబైల్(Mobile) ఉంది. ఆన్లైన్లో డేటింగ్ యాప్స్(Dating Apps) ఉన్నాయి. యువత రెచ్చిపోయి గంతులేస్తుంది. కానీ వీటితో ఎంత దూరం ఉంటే అంతమంచిది అంటున్నారు పోలీసు అధికారులు(Police Officers). ఇవి యువత భవిష్యత్తుకు పెద్ద చేటు అంటున్నారు. తాజాగా డేటింగ్ యాప్(Dating App)లో పరిచయమైన యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని గురుగ్రామ్ హోటల్లో ఈ అత్యాచార ఘటన జరిగింది. యాప్‌లో ఆ మహిళతో పరిచయమైన వ్యక్తితో పాటు అతని స్నేహితుడు ఇద్దరు కలిసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఈ సంఘటన జూన్ 29వ తేదిన జరిగింది. డేటింగ్ యాప్‌లో యువతి యువకులు పరిచయాలు ఎంతటి దారుణాలకు ఒడిగడుతాయో చెప్పే సంఘటన ఇది. ఒక అమ్మాయికి ఇదే యాప్‌లో ఒక వ్యక్తి పరిచయ్యాడు. వారు కొద్దిరోజులు మాట్లాడుకున్న తరువాత తనని ఓ హోటల్‌కు ఆహ్వానించాడు. గురుగ్రామ్‌లోని సెక్టార్ 50 ఏరియాలో ఉన్న హోటల్‌కు బాధిత అమ్మాయి వెళ్లింది. అయితే అక్కడ ఆ అమ్మాయిపై రేప్ జరిగిందని మహిళ ఫిర్యాదు ఇచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హోటల్‌కు వెళ్లిన తనకు డిన్నర్ ఆఫర్ చేశారని, అయితే ఆ భోజనం తిన్న తర్వాత తాను మత్తులోకి వెళ్లిపోయిందని, ఆ తర్వాత ఆ ఇద్దరూ తనపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని, వీడియో కూడా తీశారని, ఒకవేళ ఎదురు తిరిగితే వీడియోను బయటపెడుతామని హెచ్చరించినట్లు ఫిర్యాదులో పేర్కందని తెలిపారు. ఇక తాను సృహలోకి వచ్చిన తరువాత జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ గుర్తు తెలియని వ్యక్తులపై గ్యాంగ్ రేప్ కేసు బుక్ చేసినట్లు ఎస్‌హెచ్‌వో ప్రవీణ్ మాలిక్ తెలిపారు. ఇలాంటి ఆన్లైన్ యాప్స్ తో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కేసు దర్యాప్తు జరుగుతుందని త్వరలోనే అత్యాచారానికి పాల్పడిన వారిని పట్టుకుంటామన్నారు.