VRA Regularise: వీఆర్ఏలను (VRA) తెలంగాణ ప్రభుత్వం క్రమబద్దీకరించింది. సోమవారం సాయంత్రం జీవో విడుదల చేసింది. దీంతో వీఆర్ఏల కోరిక నేరవేరింది. తమను రెగ్యులరైజ్ చేయాలని ఇదివరకు 100 రోజులకు పైగా వీఆర్ఏలు (VRA) నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ ప్రభుత్వం దిగి వచ్చింది. క్రమబద్దీకరిస్తామని మాట ఇచ్చింది. ఆ వెంటనే తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వీఆర్ఏల (VRA) పోస్టులు, రెగ్యులరైజేషన్‌కు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం కూడా వేసింది. కమిటీ సూచనల మేరకు.. చదువును బట్టి వేతనం, పోస్ట్ ఖరారు చేసింది.
పదో తరగతి చదివిన వారు 10,317 మంది ఉన్నారు. వీరు లాస్ట్ గ్రేడ్ సర్వీస్‌గా గుర్తించారు. వీరికి రూ.19 వేల నుంచి రూ.58,850 వేతనం ఇస్తారు. ఇంటర్ చదివిన 2761 మంది ఉన్నారు. వీరికి రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఇస్తారు. వీరికి రూ.22,240 నుంచి రూ.67,300 వేతనం ఉంటుంది. డిగ్రీ అంతకన్నా ఎక్కువ చదివిన వారు 3680 మంది ఉన్నారు. వీరిని జూనియర్ అసిస్టెంట్‌గా పోస్ట్ ఇస్తారు. వీరికి రూ.24,280 నుంచి 72,850 వేతనం ఉంటుంది. అలాగే 3797 మంది వారసులకు ఉద్యోగాలు కల్పిస్తారు.