»A Movie With Ram Charan Soon Prabhas Said Good News
Prabhas: త్వరలోనే రామ్ చరణ్‌తో సినిమా..గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభాస్
త్వరలోనే రామ్ చరణ్‌తో తాను నటించనున్నట్లు రెబల్ స్టార్ ప్రభాస్ తెలిపారు. 'కల్కి 2898 ఏడీ' టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ ఈ విషయాన్ని ప్రకటించాడు. దీంతో ఈ మల్టీ స్టారర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) చేస్తున్న తాజా చిత్రం ప్రాజెక్ట్K (Project K). నేడు ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD) పేరును ఖరారు చేస్తూ గ్లింప్స్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్K యూనిట్ పాల్గొని గ్లింప్స్ వీడియోను రిలీజ్(Video Release) చేసింది. ఈ సందర్భంగా అక్కడున్న మీడియాతో మూవీ టీమ్ ముచ్చటించింది. ఈ తరుణంలో ప్రభాస్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
బాహుబలి, ఆదిపురుష్, సాహో, సలార్, ఇప్పుడు కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) వంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నారని, బ్లూ స్క్రీన్ సన్నివేశాల్లో నటిస్తుంటే బోర్ కొట్టడం లేదా అనే ప్రశ్న ప్రభాస్ కు ఎదురైంది. అందుకు ప్రభాస్ సమాధానం ఇస్తూ..మొదట్లో తనకు చాలా బోర్ కొట్టిందని, అంత పెద్ద బ్లూ స్క్రీన్ పై తాను చాలా చిన్నగా కనిపించేవాడినని, గ్లింప్స్ చూశాక ఆనందంగా ఉందన్నారు. వాటిని చూస్తుంటే చాలా బావుందని తెలిపారు.
ఇండియాలో రాజమౌళి(Rajamouli) అద్భుతమైన ఆర్ఆర్ఆర్(RRR) తీశాడని, సినిమాలోని పాటకు ఆస్కార్ రావడం ఆనందాన్నిచ్చిందన్నారు. రామ్ చరణ్(Ramcharan) తనకు మంచి మిత్రుడని, త్వరలోనే తామిద్దరం కలిసి నటిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్(Prabhas) చెప్పిన మాటల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్, రామ్ చరణ్‌ల కాంబోలో మంచి సినిమా వస్తే గనుకు అది బిగ్ మల్టీస్టారర్ అవుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న కల్కి 2898 ఏడీ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు తెలిపారు.