నందమూరి కళ్యాణ్ రామ్ షాకుల మీద షాక్ ఇస్తునే ఉన్నాడు. చాలా సంవత్సరాల తర్వాత బింబిసార సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్న కళ్యాణ్.. ఇప్పుడు ట్రిపుల్ డోస్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. బింబిసార తర్వాత ఆయన నుండి ‘అమిగోస్’, ‘డెవిల్’ అనే సినిమాలు రాబోతున్నాయి. వీటిలో ముందుగా అమిగోస్ మూవీ ఫిబ్రవరిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో అమిగోస్ నుంచి ఫస్ట్ లుక్ ట్రీట్ ఇస్తునే ఉన్నాడు కళ్యాణ్ రామ్. మామూలుగా ఒక సినిమాకు ఒకే ఒక ఫస్ట్ లుక్ ఉంటుంది. కానీ అమిగోస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ మూడు కొత్త లుక్లతో సర్ప్రైజ్ చేశాడు రామ్. న్యూ ఇయర్ కానుకగా అమిగోస్ నుండి సిద్ధార్త్ అనే లుక్ రివీల్ చేయగా.. ఆ తర్వాత సాఫ్ట్ వేర్ మంజునాథ్ లుక్‌ను రివీల్ చేశాడు. ఇప్పుడు తాజాగా మరో సాలిడ్ అండ్ స్టైలిష్ లుక్‌తో షాక్ ఇచ్చాడు కళ్యాణ్ రామ్. అలాగే టీజర్ టైం కూడా ప్రకటించాడు. జనవరి 8న ఉదయం 11 గంటల 7 నిమిషాలకు అమిగోస్ టీజర్ విడుదల చేయబోతున్నట్లుగా అనౌన్స్ చేశారు. ఇక మొదటి రెండు లుక్స్‌కి పూర్తి భిన్నంగా గడ్డంతో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో.. గన్ పట్టుకోని స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు కళ్యాన్. అయితే ఈ క్యారెక్టర్ పేరు మాత్రం అనౌన్స్ చేయలేదు. దాంతో థర్డ్ లుక్ ఆసక్తికరంగా మారింది. అయితే అమిగోస్ కథేంటనేది.. ఓ క్లారిటీ రావాలంటే టీజర్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక అసలు కథ కావాలంటే.. ఫిబ్రవరి 10న సినిమా థియేటర్లోకి వచ్చే వరకు ఆగాల్సిందే. అన్నట్టు ఈ సినిమాతో.. రాజేంద్ర రెడ్డి అనే కొత్త డైరెక్టర్ పరిచయం అవుతున్నాడు.. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.