ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ వేగంగా పావులు కదుపుతోంది. పార్టీలో చేరే నేతలు కూడా పెరుగుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా… ఈ పార్టీ ప్రభావం ఏపీలో ఎంత ఉంటుంది అనే విషయంపై తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రభావం ఏ మాత్రం ఉండదని కొడాలి నాని తేల్చి చెప్పారు.
రాష్ట్రాన్ని విడగొట్టడంలో గానీ, రాష్ట్రానికి నష్టం కలిగించడంలో గానీ కేసీఆర్ పాత్ర ఉందని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని నాని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ భవితవ్వం దేశ వ్యాప్తంగా ఎలా ఉంటాదో తాను చెప్పలేనని, ఏపీలో మాత్రం ఎటువంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.
కేసీఆర్ ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని, తమకు ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని కొడాలి నాని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో గానీ, దేశంలో గానీ ఏ పార్టీతోనూ పొత్తు లేకుండానే తాము పోటీ చేస్తామని నాని తెలిపారు.
వైఎస్ఆర్ పార్టీ ఏపీ బాగుకోసం, సంక్షేమం కోసం ఏర్పడిన పార్టీ అని నాని స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లో వైఎస్ఆర్ పార్టీ అంశాల వారీగా, అక్కడున్న పరిస్థితులను బట్టి ఎవరికి మద్దుతు ఇవ్వాలో వారికి మద్దతు ఇస్తుందని తెలిపారు. ఆ విషయంలో పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉంటారని కొడాలి నాని అన్నారు.