»The Second Phase Varahi Yatra Start July 9th At Eluru Town 5pm
Varahi yatra: నేటి నుంచి రెండో విడత వారాహి యాత్ర
జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(pawan kalyan) ఈరోజు(జులై 9) నుంచి రెండో విడత వారాహి యాత్ర(varahi yatra)ను పునఃప్రారంభించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఏలూరు నుంచి బహిరంగ సభతో యాత్ర ప్రారంభమవుతుంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్(pawan kalyan) ఆదివారం(జులై 9) నుంచి రెండో విడత వారాహి యాత్ర(varahi yatra) ప్రారంభించనున్నారు. ఏలూరులో జరిగే బహిరంగ సభలో సాయంత్రం 5 నుంచి ఇది మొదలు కానుంది. వారాహి విజయ యాత్ర రెండో విడతలో పవన్ కళ్యాణ్ ఏలూరు నుంచి ప్రారంభమయ్యి దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ యాత్రలో జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొననున్నారు.
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను కవర్ చేస్తూ పవన్(pawan) తన మొదటి దశ వారాహి యాత్రను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. రెండు వారాల ఫేజ్-1 యాత్రలో ఆయన వివిధ పట్టణాలను సందర్శించారు. ఈ సమయంలో అతను తన నాలుగేళ్ల వైసీపీ పాలనలో ప్రభుత్వం చేసిన లోపాలు, కమీషన్ల గురించి ప్రశ్నించి రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు ఆయనను టీడీపీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడిగా పేర్కొంటూ మొత్తం 175 స్థానాల్లో పోటీ చేయాలని వైఎస్సార్సీపీ సవాల్ విసిరింది.