Shirley Setia: సింగర్ నుంచి హీరోయిన్ గా మారిన షిర్లీ
షిర్లీ సెటియా సింగర్, నటి పుట్టింది ఇండియాలోనే కానీ పెరిగింది మాత్రం న్యూజిలాండ్. అయినా కూడా ఇక్కడి సంప్రదాయాలు మరువకుండా పాటలు ప్రాక్టీస్ చేసింది. గుర్తింపు దక్కించుకుంది. ఆ క్రమంలో సింగర్ నుంచి హీరోయిన్ స్థాయికి చేరింది. హీందీతోపాటు తెలుగు చిత్రాల్లో కూడా యాక్ట్ చేసింది.
యంగ్ సింగర్, హీరోయిన్ షిర్లీ సెటియా లేటెస్ట్ ఫొటోషూట్ చిత్రాలు వావ్ అనిపిస్తున్నాయి.
తన ఇన్ స్టా ఖాతాలో బ్లూ బర్త్ డే అంటూ ట్యాగ్ చేసి పలు ఫొటోలను అప్ లోడ్ చేసింది.
అవి చూసిన నెటిజన్లు సూపర్ అంటూ విషెస్ చెబుతూ అభినందనలు తెలియజేస్తున్నారు.
అంతేకాదు ఈ చిత్రాలు పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 4 లక్షల మందికిపైగా ఈ చిత్రాలను లైక్ చేయడం విశేషం.
ఇక ఈ అమ్మడు మన ఇండియాలోని పూర్వపు కేంద్రపాలిత ప్రాంతమైన డామన్‌లో జన్మించింది. ఆ తర్వాత తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ లోని ఆక్లాండ్‌కు వలసవెళ్లారు.
ఆక్లాండ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడే బాలీవుడ్ పాటల కవర్ సాంగ్స్ చేస్తూ యూట్యూబ్ సంగీత విద్వాంసురాలుగా అనేక మందిని ఆకర్షించింది. సెటియా తరువాత ఫోర్బ్స్ మ్యాగజైన్లో ప్రదర్శించబడింది.
వారానికోసారి రేడియో షోలో పనిచేసి ఆక్లాండ్‌లో స్థానిక పోటీల్లో పాల్గొన్న తర్వాత సెటియా 2016లో ముంబై, హైదరాబాద్‌లలో తన మొదటి కచేరీలలో ప్రదర్శన ఇచ్చింది. ఆ క్రమంలో న్యూజిలాండ్ లో అతిపెద్ద అంతర్జాతీయ కళాకారులలో ఒకరిగా కూడా గుర్తింపుదక్కించుకుంది.
ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 2020 హిందీ చిత్రం మస్కాతో సెటియా తన నటనను ప్రారంభించింది.
ఆమె 2022లో నికమ్మతో పెద్ద స్క్రీన్‌లోకి ప్రవేశించింది.
సెప్టెంబర్ 23, 2022న విడుదలైన తెలుగు చిత్రం కృష్ణ బృందా విహారిలో కూడా హీరోయిన్ గా యాక్ట్ చేసింది.