అమెరికా(America)లో ఓ వ్యక్తికి బంఫర్ ఆఫర్ తగిలింది. విమానంలో ఒక్కడు ఫస్ట్ క్లాస్ (First class) లో, అది కూడా ఉచితంగా ప్రయాణించే అవకాశం దక్కింది. ఓక్లహామా సిటీ (Oklahoma City) నుంచి నార్త్ కరోలినా వెళ్లాల్సిన విమానం బాగా లైట్అయింది. ఫ్లైట్ బయల్దేరేందుకు 18 గంటల సమయం పడుతుందని ఎయిర్ లైన్స్ (Air lines) సిబ్బంది పెర్కోన్నారు. దాంతో, ఆ విమానంలో టికెట్లు బుక్ చేసుకున్నవారు ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకుని నార్త్ కరోలినా వెళ్లిపోయారు. ఎక్కడికీ వెళ్లకుండా ఓ వ్యక్తి 18 గంటల పాటు ఓపిగ్గా కూర్చున్నాడు. అతడి పేరు ఫిల్ స్ట్రింగర్. అతడి ఓపిక బంపర్ చాన్స్ తెచ్చిపెట్టింది.
ఇతర ప్రయాణికులు వెళ్లిపోయినా, ఆ ఒక్కడు మాత్రమే ఉన్నప్పటికీ, అతడి కోసం విమానం నడపాలని సదరు ఎయిర్ లైన్స్ నిర్ణయించింది. అంతేకాదు, అతడిని పూర్తి ఉచితంగా, (First class)లో కూర్చోబెట్టి మరీ నార్త్ కరోలినా తీసుకెళ్లారు. అప్పటికీ స్ట్రింగర్ కు నమ్మశక్యం కాలేదు. విమానంలోకి వెళ్లి చూస్తే రియాల్గానే ఎవరూ లేరు. అయితే తన ఒక్కడి కోసం విమానం నడపడం సరికాదేమోనన్న భావన కలిగిందని స్ట్రింగర్ ఆ తర్వాత సోషల్ మీడియాలతో తన ఫ్లైట్ (flight) ప్రయాణ అనుభవాలను పంచుకున్నాడు. తనను సంతోషంగా ఉంచేందుకు ఆ విమాన సిబ్బంది ప్రయత్నించారని, తనకు పార్టీ కూడా ఇచ్చారని వెల్లడించాడు. ఇదొక మరపురాని అనుభవం అని పేర్కొన్నాడు.