»Priyanka Chopra Stuns In Gorgeous White Suit As She And Nick Jonas Make Malti Try Her First Fascinator For Royal Ascot
Priyanka Chopra: కూతురితో ప్రియాంక, దేశీ లుక్ లో అదిరిపోయింది..!
బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన నటిమణుల్లో ప్రియాంక చోప్రా ఒకరు. ఇక్కడ వరుస సినిమాలతో దూసుకుపోతున్న తరుణంలోనే హాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడ సైతం తనదైన ముద్ర వేసింది. అయితే ఈ బ్యూటీ కొన్నేళ్ల క్రితం హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ప్రియాంక కంటే నిక్ వయస్సులో 10 ఏళ్లు చిన్నవాడు కావడంతో అప్పట్లో వారి పెళ్లి విషయంలో పెద్ద చర్చ జరిగింది. అనంతరం కొన్ని సంవత్సరాల క్రితం ఈ జంటకి సరోగసీ ద్వారా ఓ కూతురు జన్మించింది. కొంత కాలం క్రితం తన కూతురి ఫోటోని షేర్ చేసింది ప్రియాంక, ఆ ఫోటో చూసి అందరూ ఎంత ముద్దుగా ఉందో అనుకున్నారు. తాజాగా కూడా కూతురితో కలిసి దిగిన ఓ ఫోటోని షేర్ చేసింది. అందులో ప్రియాంక వైట్ కలర్ సాల్వార్ కుర్తా ధరించి ఉన్నారు. దేశీ గర్ల్ లుక్ లో చాలా అందంగా కనిపించింది.
సమ్మర్ కి సరిగా సరిపోయే కాటన్ కుర్తాని ఆమె ధరించారు. దానికి మ్యాచింగ్ ఎంబ్రాయిడరీ కాటన్ దుప్పట్టా, స్ట్రెయిట్ ప్యాంట్ తో పెయిర్ చేశారు. ఇక ప్రియాంక హెయిర్ ని ముడి వేశారు. చెవులకు పెద్ద గోల్డ్ కలర్ ఇయర్ రింగ్స్ ధరించారు. ఆమె లుక్ చాలా అందంగా ఉ:ది. కాగా, ప్రియాంక పక్కన ఆమె భర్త నిక్, కూతురు కూడా వైట్ కలర్ దుస్తుల్లో మెరవడం విశేషం. పాపను ప్రియాంక ఎత్తుకొని ఉండగా, నిక్ పాప తలకు క్యాప్ పెడుతున్నారు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ పిక్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.