ATP: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను ఆయన స్వగృహం నందు శనివారం గుత్తి, పామిడి మండల రైతులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జొన్న, మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించి గుత్తి మార్కెట్ యార్డు నందు కొనుగోలు చేయాలని ఎమ్మెల్యేకి విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య త్వరగా పరిష్కరిస్తామన్నారు.