E.G: నిడదవోలు మండలం తాళ్ళపాలెం సమీపంలో రోడ్డు మార్గంలో రైల్వే అండర్ పాస్ అవే వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట పొలాల్లో నుంచి వచ్చే నీరు కాలువ ద్వారా ఇక్కడికి చేరింది. బురద నీరు, పేరుకుపోయిన సిల్ట నిత్యం పలు వాహనదారులు రాకపోకల సమయంలో అవస్థలు పడుతున్నారు. తక్షణం బంకమట్టిని తొలగించి తగిన చర్యలు తీసుకోవాలని వాహనాదారులు కోరుతున్నారు.