KDP: ఎర్రగుంట్ల మండల పరిధిలో గల పెద్దనపాడు శివాలయం వద్ద ఈనెల 12వ తేదీ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల్లో అగ్రగన్యుడు, ఆంధ్ర పితామహుడిగా ప్రసిద్ధికెక్కిన అల్లసాని పెద్దన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అల్లసాని పెద్దన్న జీవిత సాహిత్యం అనే అంశంపై శతాధిక కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.