ATP: అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో అష్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ టెన్నిస్ బాల్ క్రికెట్ లీగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడలను ప్రారంభించారు. పదకొండు జిల్లాల నుంచి మహిళా క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. క్రీడలు ఉపాధికి దోహదపడతాయని, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఎంపీ పిలుపునిచ్చారు.