SRCL: క్రీడల వల్ల ఆరోగ్యం చేకూరుతుందని గండి లచ్చపేట సర్పంచ్ జంగిటి అంజయ్య అన్నారు. సంక్రాంతి సెలవుల సందర్భంగా తంగళ్ళపల్లి మండలం గండి లచ్చపేటలో క్రికెట్ పోటీలను ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు స్నేహభావం, శారీరక దారుఢ్యానికి దోహదపడతాయని పేర్కొన్నారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగారెడ్డి, సాగర్, శేఖర్ ఉన్నారు.