కృష్ణా: జిల్లాలో గంజాయి అమ్మకాలను నియంత్రించేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం కలెక్టర్‌లో ఎస్పీ విద్యాసాగర్‌తో కలిసి నార్కోటిక్స్ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితులను గంజాయి గానీ మాదకద్రవ్యాలు గాని అమ్మకాలు జరగరాదన్నారు.