W.G: రాష్ట్రంలోని 84 కేంద్రాల ద్వారా ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ సేవలు అందిస్తున్నట్లు డిపో మేనేజర్ దానమ్మ తెలిపారు. డోర్ డెలివరీ మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం తాడేపల్లిగూడెం డిపో నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎం దానమ్మ మాట్లాడుతూ.. పది కిలోమీటర్ల పరిధిలో డోర్ డెలివరీ అందిస్తున్నట్లు తెలిపారు.