HNK: తెలంగాణ ప్రజలకు కొండంత అండగా కల్యాణలక్ష్మి పథకం నిలుస్తున్నదని స్టేషనపూన్పూర్ MLA కడియం శ్రీహరి అన్నారు. ధర్మసాగర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఆయన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 29 మందికి MLA ఈ చెక్కులు అందజేశారు. సంక్షేమ పథకాల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దన్నారు.