MBNR: సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై వేణు హెచ్చరించారు. దీనివల్ల పక్షులు, వాహనదారుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్నారు. యువత కేవలం కాటన్ దారాన్నే వాడాలని, ఎక్కడైనా రహస్యంగా మాంజా విక్రయిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు.