కృష్ణా జిల్లాను పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా ‘100 డేస్ యాక్షన్ ప్లాన్’ అమలు చేస్తున్నట్లు DEO సుబ్బారావు తెలిపారు. విద్యార్థుల విద్యా ప్రగతిని మెరుగుపరిచేందుకు ఈ ప్రత్యేక ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోందన్నారు. 100% ఉత్తీర్ణతే ధ్యేయంగా ఉపాధ్యాయులు, అధికారులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలని ఆయన కోరారు.