విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా.. జైపూర్ వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అదరగొట్టాడు. ఓకే ఓవర్లో వరుసగా 6,4,6,4,6,4తో రాణించాడు. మొత్తంగా 20 బంతుల్లో 62 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అయితే మయాంక్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్‌గా వెనుదిరగడంతో సర్పరాజ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.