JGL: పెగడపల్లి మండలం మద్దులపల్లి తండా అంగన్వాడీ కేంద్రంలో గురువారం చిన్నారులకు సర్పంచ్ బలరాంరెడ్డి ఆధ్వర్యంలో అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారాలను లబ్ధిదారులకు సక్రమంగా పంపిణీ చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, టీచర్, తదితరులు పాల్గొన్నారు.