MHBD: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సీఎం కప్ టార్చ్ ర్యాలీ కార్యక్రమం ఈరోజు జరిగింది. అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి స్థానిక MLA డా. భూక్య మురళీనాయక్ ఈ ర్యాలీని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో యువతను క్రీడల్లోకి రావాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. యువత అధికసంఖ్యలో క్రీడల్లో రాణించాలని సూచించారు.