BPT: డ్రైవర్లు అప్రమత్తంగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని బాపట్ల జిల్లా రవాణా శాఖ అధికారి పరందామరెడ్డి చెప్పారు. బుధవారం బాపట్ల ఆర్ట్స్ కళాశాలలో రహదారి భద్రతా మహోత్సవాలలో భాగంగా స్కూల్ బస్సు డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం, వైద్య శిబిరం నిర్వహించారు. రహదారి ప్రమాదాలను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ పాల్గొన్నారు.