SRPT: గురువారం తెల్లవారుజామున బీపీ డౌన్ కావడంతో మునగాల మండల కేంద్రానికి చెందిన 70 ఏళ్ల ఆర్య వైశ్యుడు అరవపల్లి గోపాలరావు అకస్మాత్తుగా మృతి చెందారు. ఆయన మృతి పట్ల ఆర్యవైశ్య సంఘం నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గోపాలరావు మృతి ఆర్యవైశ్య సంఘానికి తీరని లోటని పలువురు వాపోయారు.