అల్లూరి: అనంతగిరి మండలం కివర్ల పంచాయతీలో సెల్ టవర్ లేక గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ పథకాలు, పట్టాదారు పుస్తకాలకు ఈ-కేవైసీ కోసం కొండలపైకి వెళ్లి ఎండలో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి సెల్ టవర్ నిర్మించి సమస్య పరిష్కరించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.